హేట్ స్పీచ్ బిల్లును సమీక్షించేందుకు కమిటీ.. కొన్ని రోజుల్లో రిపోర్ట్!
భారతదేశం, జూలై 7 -- విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో 12 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించాలని స్పీకర్ ఈ కమిటీని ఆదేశించారు.
విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టే చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టాన్ని, తదుపరి చర్యలు చేపట్టే ముందు సవివరమైన పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు బాలు నాయక్, తోట లక్ష్మీకాంతరావు, మధుసూదన్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మామిడాల యశస్విని, దానం నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.