భారతదేశం, అక్టోబర్ 15 -- వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు వీసా నిబంధనల రూపంలో మరోసారి ఆందోళన మొదలైంది. హెచ్-1బీ సహా వివిధ రకాల ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత వీసాల పొడిగింపు (ఎక్స్‌టెన్షన్) దరఖాస్తులను పరిశీలించేటప్పుడు, గతంలో ఇచ్చిన అనుమతులను యథాతథంగా ఆమోదించే విధానానికి స్వస్తి పలకాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్ఎస్) ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రతిపాదనలను ప్రచురించింది.

ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) అధికారులకు వీసా దరఖాస్తులను పునఃసమీక్షించేందుకు పూర్తి స్థాయి విచక్షణాధికారాలు లభిస్తాయి. గతంలో ఒక ఉద్యోగికి వీసా ఆమోదం పొందినప్పటికీ, పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ అతని అర...