భారతదేశం, మే 15 -- దేశీయ మైనింగ్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ (PSU) హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, 2026 మార్చి త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated Profit) 137.3 శాతం వృద్ధితో Rs.444.27 కోట్లకు చేరుకుంది. 2025 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం కేవలం Rs.187.18 కోట్లుగా మాత్రమే ఉండటం గమనార్హం. కేవలం త్రైమాసిక ఫలితాలే కాకుండా, వార్షిక ప్రాతిపదికన కూడా కంపెనీ తన దూకుడును కొనసాగించింది.

కంపెనీ ఆదాయ వనరులు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయి. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 58 శాతం పెరిగి Rs.1,156.08 కోట్లకు చేరుకుంది. కంపెనీ వ్యాపార సామర్థ్యానికి అద్దం పట్టే ఎబిటా (EBITDA) 111 శాతం పెరిగి Rs.660.26 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా కంపెనీ మార్జిన్లు 40.2 శాతం నుండి ఏకంగా...