భారతదేశం, జూలై 9 -- బోస్టన్ (అమెరికా): ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ న్యూరాలజీ విభాగంలో న్యూరోఇమ్యునాలజీ (Neuroimmunology) రంగంలో పరిశోధనలు చేస్తున్న తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ చంద్ర కోడాలి నేతృత్వంలో జరిగిన కీలక అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత Nature Portfolio జర్నల్ Communications Medicineలో ప్రచురితమైన ఈ పరిశోధన అల్జీమర్స్ వ్యాధిపై రెండు ముఖ్యమైన కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

శతాబ్దానికి పైగా క్షయవ్యాధి నివారణ కోసం ఉపయోగిస్తున్న BCG టీకా, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని గతంలో పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచించాయి. అయితే ఆ సంబంధం వెనుక ఉన్న జీవశాస్త్రపరమైన కారణం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.

ఈ నేపథ్యంలో నిర్వహించిన ఏడాది పాటు ...