భారతదేశం, సెప్టెంబర్ 20 -- జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలు, ఐశ్వర్యం, భోగభాగ్యాలకు కారకుడైన శుక్ర గ్రహం తన నక్షత్ర సంచారాన్ని మార్చింది. శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. స్వాతి నక్షత్రానికి అధిపతి నీడ గ్రహమైన రాహువు. శుక్ర, రాహువుల ఈ ప్రభావం కారణంగా మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారిపై ఎదో ఒక రకమైన ప్రభావం పడుతుంది.

అయితే ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నక్షత్ర మార్పు వల్ల ప్రధానంగా నాలుగు రాశుల వారికి విశేషమైన ధన యోగం పడుతోంది. వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం కానున్నాయి. ఆ నాలుగు రాశుల జాతకులకు కలగబోయే ప్రయోజనాలు ఇవే.

వృషభ రాశి వారికి శుక్ర-రాహువుల ప్రభావం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్య...