భారతదేశం, నవంబర్ 16 -- లోన్ కావాలా.. క్రెడిట్ కార్డు తీసుకుంటారా అంటూ రోజూ వచ్చే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారాయి. ఈ అవాంఛిత వాణిజ్య కమ్యూనికేషన్ల (యూసీసీ) బెడదను అరికట్టేందుకు భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) నిఘాను ముమ్మరం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జులై-సెప్టెంబర్ 2026) సంబంధించిన గణాంకాలను ట్రాయ్ తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రధాన ప్రైవేట్ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో నెట్‌వర్క్ నుంచి వచ్చే స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లపై అతి తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి.

2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికాం ఆపరేటర్ల కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలు ఏకంగా 19.9 బిలియన్ల (1,990 కోట్లు) ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను అనుమానిత స్పామ్‌గా గుర్తించాయి. ఇందులో...