భారతదేశం, అక్టోబర్ 11 -- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు(BCs) టీడీపీ పార్టీ తరఫున 40 శాతం వరకు సీట్లు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఫలితాల ఆధారంగానే పార్టీ నాయకుల పనితీరును అంచనా వేస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ సీనియర్ నాయకులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకోవడానికి, ఎన్నికలను వాయిదా వేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లిందన్నారు. రిజర్వేషన్లను 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించడం ద్వారా ఆ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీసీల సంక్షేమం పట్ల YSRCPకి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని చంద్రబాబు అన్నారు. గత కొన్నేళ్లుగా వైసీపీ.. బీసీలను...