స్థానిక పోరులో సీఏపీఎఫ్ దళాలను దించండి: ఏపీ ఈసీకి వైఎస్సార్సీపీ లేఖ
భారతదేశం, అక్టోబర్ 9 -- తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం దుర్వినియోగానికి పాల్పడకుండా, అభ్యర్థులకు బెదిరింపులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మూడు వేర్వేరు లేఖలు రాశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అభ్యర్థులకు, ఓటర్లకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రతిపాదకులు, పోలింగ్ ఏజెంట్లకు టీడీపీ శ్రేణుల నుంచి ముప్పు పొంచి ఉందని లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాలు, సున్నితమైన పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల వద్ద నిరంతరం సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.