భారతదేశం, అక్టోబర్ 23 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భౌతికంగా అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), పోలీసుల పాత్రపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, వ్యవస్థలన్నీ పూర్తిగా వీధిపాలయ్యాయని మండిపడ్డారు.

స్థానిక పోరులో జరుగుతున్న అక్రమాలపై తాము అన్ని ఆధారాలతో అధికారులను, రాజ్యాంగ వ్యవస్థలను ఆశ్రయించామని జగన్ స్పష్టం చేశారు. "స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న దారుణాలను, అక్రమాలను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంచుతున్నాం. మేము...