భారతదేశం, నవంబర్ 5 -- తెలంగాణ నూతన ఆవిష్కరణల వేదిక, భారతదేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ హబ్ అయిన టీ-హబ్ (T-Hub) మరో కీలక ఈవెంట్ జరగనుంది. నవంబర్ 16న ఇజ్రాయెల్‌కు చెందిన 20 ప్రముఖ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధి బృందానికి టీ-హబ్ ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశీ సాంకేతికతతో స్థానిక బిజెనెస్‌లను అనుసంధానించడం, కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలోని స్థానిక స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ఈ ఈవెంట్‌లో పాల్గొని ఇజ్రాయెల్ కంపెనీలతో భాగస్వామ్యం వహించాలని టీ-హబ్ పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఈ 20 కంపెనీలు భవిష్యత్ సాంకేతికతలకు సంబంధించిన పలు కీలక విభాగాలలో పనిచేస్తున్నాయి.

డిఫెన్స్ టెక్‌లో ...