భారతదేశం, మార్చి 30 -- భారతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం పెను ప్రకంపనలు రేగాయి. మదుపర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, దేశీయ ఆర్థిక రంగంలో నెలకొన్న అస్థిరత వంటి కారణాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,636 పాయింట్లు (2.22%) నష్టపోయి 71,947.55 వద్ద స్థిరపడింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 488 పాయింట్లు (2.14%) కోల్పోయి 22,331.40 స్థాయికి పడిపోయింది. దిగ్గజ షేర్లే కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2.5% మేర నష్టపోయాయి.

ఈ భారీ పతనంలో బీఎస్‌ఈలో ఏకంగా 1,546 షేర్లు తమ 52 వారాల కనిష్ట స్థాయిని (52-week low) తాకాయి. వీటిలో దేశంలోనే అతిపెద్ద కంపెనీలైన టీసీఎస్ (TCS), ఐటీసీ (ITC), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank),...