భారతదేశం, ఏప్రిల్ 10 -- భారతీయ రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాధాన్యత మారుతోంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతుండటంతో 'గ్రో' వంటి ప్లాట్‌ఫారమ్‌లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రో మాతృసంస్థ 'బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్' (Billionbrains Garage Ventures) షేర్లు శుక్రవారం (ఏప్రిల్ 10) బిఎస్ఈ (BSE)లో సరికొత్త రికార్డును సృష్టించాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే షేర్ ధర 6 శాతం పెరిగి Rs.197.50 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.

గడిచిన మూడు సెషన్లుగా ఈ స్టాక్ వరుస లాభాలను మూటగట్టుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే షేర్ విలువ 20 శాతం పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గడిచిన ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ దాదాపు 50 శాతం రిటర్న్స్ అందించగా, ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు 25 శాతం మేర లా...