భారతదేశం, సెప్టెంబర్ 9 -- స్టాక్ మార్కెట్‌లో ఏవైనా రెండు కంపెనీలను పోల్చి చూసేటప్పుడు ఇన్వెస్టర్ల మనసులో మొదట మెదిలేది ఆ కంపెనీ పరిమాణం ఎంత అనే ప్రశ్న. ఈ కంపెనీల పరిమాణాన్ని, వాటి విలువను సులువుగా అర్థం చేసుకునేందుకు 'మార్కెట్ క్యాపిటలైజేషన్' లేదా 'మార్కెట్ క్యాప్' ఒక ప్రామాణిక కొలమానంగా ఉపయోగపడుతుంది.

మార్కెట్ క్యాప్ అనేది ఒక కంపెనీకి చెందిన మార్కెట్‌లోని మొత్తం షేర్ల విలువను సూచిస్తుంది. కంపెనీ ప్రస్తుత షేరు ధరను, మార్కెట్‌లో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో గుణించడం ద్వారా ఈ మార్కెట్ క్యాప్‌ను లెక్కిస్తారు. ప్రతి ట్రేడింగ్ రోజున షేరు ధరల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి, కాలక్రమేణా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా మారుతుంటుంది.

భారతదేశంలో కంపెనీలను వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్‌ల ఆధారంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రకాలుగా ...