భారతదేశం, మే 6 -- వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కాకతీయ కాలం నాటి 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని మంగళవారం అధికారులు కూల్చివేశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ పురాతన రాతి కట్టడాన్ని, భూమిని చదును చేయడానికి బుల్డోజర్లను ఉపయోగించి నేలమట్టం చేశారు.

ఈ పురాతన ఆలయం కూల్చివేత తీవ్ర నిరసనలకు దారితీసింది. కాంట్రాక్టర్ ఏకపక్షంగా ఆలయాన్ని నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న కట్టడాలకు సంబంధించిన నిబంధనలను పక్కనపెట్టి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మద్దతుతో ఈ చర్య చేపట్టారని స్థానికులు ఆరోపించారు.

వారసత్వ ప్రదేశాన్ని ధ్వంసం చేసే ముందు పురావస్తు, దేవాదాయ శాఖల నుండి అవసరమైన అనుమతులు పొందారా లేదా అనే విషయంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమ...