సౌదీలో ప్రమాదానికి గురైన తెలంగాణ నర్స్ ఆవేదన.. స్వదేశానికి రప్పించాలని తల్లి కన్నీటి విజ్ఞప్తి
భారతదేశం, ఆగస్టు 4 -- సౌదీ అరేబియాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన తెలంగాణ నర్సు గూగులోత్ సునీత(36)ను స్వదేశానికి రప్పించాలని ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. బ్యాంకు రుణం బకాయి ఉందన్న కారణంతో సౌదీ అధికారులు ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించడంతో ఆమె అక్కడ చిక్కుకుపోయారు.
ఈ విషాద సంఘటనపై సునీత తల్లి గూగులోత్ పారంగి జూలై 31న సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించి, తన కుమార్తెను కాపాడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన సునీత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అనంతరం, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు 2024 సెప్టెంబర్ 7న సౌదీ అరేబియా వెళ్లారు.
అక్కడ కింగ్ అబ్దుల్లా హాస్పిటల్లో ఐసీయూ స్పెషలిస్ట్ నర్సుగా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది రోగులకు సేవలు అంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.