భారతదేశం, జూలై 15 -- దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో సరికొత్తగా పునరాభివృద్ధి చెందిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని జనాల కోసం దక్షిణ మధ్య రైల్వే ఒక వినూత్నమైన సెల్ఫీ కాంటెస్ట్‌ను ప్రకటించింది.

'సెల్ఫీ విత్ స్టేషన్' అనే థీమ్‌తో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక మార్పులో భాగస్వామ్యులై, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవాల్సిందిగా రైల్వే అధికారులు ఆహ్వానిస్తున్నారు.

పునరాభివృద్ధి చెందిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఒక చక్కటి సెల్ఫీని క్లిక్ చేయాలి.

మీరు తీసిన సెల్ఫీ ఫోటోను welfaresectionsc@gmail.com అనే అధికారిక ఈమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

మీ సెల్ఫీని మీ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి, కింద పేర్కొన్న రైల్వే హ్యాండిల్స్‌ను తప్పకుండా ట్యాగ్ చ...