భారతదేశం, సెప్టెంబర్ 2 -- శ్రీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాంసం విక్రయాలపై కీలక ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 4వ తేదీన నగరంలోని మేకలు, గొర్రెల వధశాలలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 533(b) ప్రకారం కార్పొరేషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి పండుగ రోజున ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ, నగరంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఈ మూసివేత ఉత్తర్వులను నగరంలో అత్యంత కఠినంగా అమలు చేయడానికి వీలుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సహకారాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది....