భారతదేశం, నవంబర్ 9 -- తెలంగాణలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు వారి సొంత జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్య సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది, ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

ఇటీవల డీఎస్‌హెచ్‌ పరిధిలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించడంతో పాటు అవసరమైన నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ నియామకాల ఫలితాలు ప్రజలకు అందాలంటే ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బందిని, వైద్య పరికరాలను సమర్థవం...