భారతదేశం, ఆగస్టు 12 -- నేడు, ఆగస్టు 12, 2026న ఈ సంవత్సరంలోనే రెండవ, చివరి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఖగోళ శాస్త్రవేత్తలకే కాకుండా ఆధ్యాత్మికంగా, మతపరంగానూ సూర్యగ్రహణానికి అత్యంత ప్రాముఖ్యత ఉందన్న సంగతి తెలిసిందే. హిందూ సనాతన సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయానికి, అలాగే గ్రహణం ముగిసిన తర్వాత పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలను శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశించాయి.

ముఖ్యంగా గ్రహణ మొక్ష కాలం పూర్తయిన వెంటనే స్నానం చేయడం, దేవతా పూజలు నిర్వహించడం, శక్తిమేర దానధర్మాలు చేయడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే గ్రహణం ముగియగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్నానం ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న విశ్వాసాలు ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

జ్యోతిష్యశాస్త్ర ఆధారాల ప్రకారం.. సూర్యగ్రహణ సమయంలో రాహువు ప్రభావం అత్యధికంగా ఉంటుంది. నవగ్రహాలలో రాహువును క్రూరమైన, ఛ...