భారతదేశం, సెప్టెంబర్ 2 -- కేంద్ర ప్రభుత్వానికి ఏటా Rs.1,000 కోట్లకు పైగా నష్టం కలిగించిన భారీ బంగారు ఎగుమతుల కుంభకోణాన్ని సీబీఐ ఛేదించింది. 2020 నుంచి 2022 మధ్య చెన్నై విమానాశ్రయం కార్గో విభాగంలో జరిగిన ఈ మోసంలో కస్టమ్స్ అధికారులు, నగల వ్యాపారుల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకాన్ని దుర్వినియోగం చేస్తూ కస్టమ్స్ అధికారులు, నగల వ్యాపారులు కలిసి ఈ భారీ మోసానికి పాల్పడ్డారని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఐదుగురు కస్టమ్స్ అధికారులు, ఒక జ్యువెలరీ అసెసర్, ఒక కస్టమ్స్ ఏజెంట్, నలుగురు బంగారు నగల తయారీదారులు ఉన్నారు. నిందితులలో కస్టమ్స్ సూపరింటెండెంట్లు జె. సురేష్కుమార్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.