సీబీఎస్ఈ కీలక నిర్ణయం: ఆ విద్యార్థులకు 'మూడు భాషల' విధానం నుండి మినహాయింపు
భారతదేశం, జూన్ 29 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుత విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 కింద ప్రతిపాదించిన మూడు భాషల సూత్రాన్ని (Three-Language Formula) అమలు చేయడంలో ఒకేసారి మినహాయింపు (One-time relaxation) ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. పరివర్తన కాలంలో (Transitional period) విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక సడలింపులు ఇచ్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండు నాన్-నేటివ్ భాషలను (ఉదాహరణకు ఇంగ్లీష్, ఫ్రెంచ్) ఎంచుకున్న 9వ తరగతి విద్యార్థులు అదే కాంబినేషన్‌ను కొనసాగించవచ్చు. అయితే, వారు మూడవ భాషగా ఒక భారతీయ భాషను అదనంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. "ఈ మార్పుల వల్ల ఏ విద్యార్థి కూడా నష్టపోక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.