భారతదేశం, అక్టోబర్ 16 -- భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అవమానకర, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, సీనియర్ జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేలకు సుప్రీంకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.

"మీపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలి" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ విచారణకు వారు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇస్తూ, "వారికి సుబుద్ధి కలుగుతుందని ఆశిస్తున్నాం" అని వ్యాఖ్యానించింది.

రౌత్, వాగ్లే చేసిన వ్యాఖ్యలు తీవ్ర విచారకరమని ధర్మాసనం అభిప్రాయపడింది. "తాము చేస్తున్న వ్యాఖ్యలను పర్యవేక్షిస్తున్నారనే స్పృహ కూడా...