భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారత ఆర్థిక వ్యవస్థను 'నెట్ జీరో' (నికర సున్నా ఉద్గారాలు) దిశగా వేగంగా తీసుకెళ్లేందుకు పారిశ్రామిక రంగాలు కీలక అడుగు వేశాయి. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన 25వ సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్ 2026లో పర్యావరణహిత రంగానికి, డిజిటలైజేషన్‌కు రూ.3,590 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివిధ పరిశ్రమల ప్రతినిధులు ప్రకటించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా 'ఇండియా హీట్ పంప్ అట్లాస్' అనే జాతీయ డాష్‌బోర్డ్‌ను ఈ సదస్సులో విడుదల చేశాయి.

ఈ సదస్సులో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ కృష్ణ చంద్ర పాణిగ్రాహి మాట్లాడుతూ.. "భారత ఆర్థిక వృద్ధిలో ఇంధన పొదుపు, విద్యుదీకరణ కీలక పాత్ర పోషిస్తాయి. 'వికసిత్ భ...