భారతదేశం, మే 5 -- తమిళగ వెట్రి కజగం(TVK) అధినేత విజయ్‌కు కాంగ్రెస్ పార్టీ అనూహ్య మద్దతు ప్రకటించింది. ఈ కీలక పరిణామంతో తమిళనాడులో నూతన రాజకీయ శకం ఆరంభం కాబోతోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరియు యువత ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్‌లాంటి ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఐదు రాష్ర్టాల ఎన్నికలు, ఫలితాలు, అనంతర పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని టీవీకీ అధినేత విజయ్ కోరారు. 'లౌకిక ప్రభుత్వ ఏర...