భారతదేశం, అక్టోబర్ 22 -- న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్షాలు మళ్లీ అభిశంసన (ఇంపీచ్‌మెంట్) తీర్మానం ప్రవేశపెడితే చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"విపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మేం నిర్ణీత ప్రక్రియను పాటిస్తాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసనకు ఎలాంటి విధివిధానాలు ఉంటాయో, సీఈసీకి కూడా అలాంటి స్పష్టమైన ప్రక్రియ రాజ్యాంగంలో ఉంది. ప్రతిపక్షాలు నోటీసు ఇస్తే కచ్చితంగా ఆ నిబంధనలనే అనుసరిస్తాం" అని భారత్ వేదిక...