భారతదేశం, అక్టోబర్ 24 -- తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు మైనర్లు సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని మద్దూరు పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో ఈ ఘటనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. సమాచారం అందుకున్న మద్దూరు పోలీసులు.. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు.

దసరా పండుగ రోజున బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన నిందితులు.. ఆమెను కిడ్నాప్ చేసి సమీపంలోని మరో గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మరుసటి రోజు(అక్టోబర్ 21) ఉదయం బాధితురాలిని ఆమె గ్రామ సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి చేర...