భారతదేశం, సెప్టెంబర్ 12 -- తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సవరించిన వేళల ప్రకారం రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు బెంగళూరు నుంచి బయలుదేరే రెండు ప్రధాన రైళ్ల బయలుదేరే సమయాలను శనివారం (12-09-2026) రోజున రీషెడ్యూల్ చేశారు.

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సాధారణంగా మధ్యాహ్నం 15:00 గంటలకు (మధ్యాహ్నం 3:00 గంటలకు) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ.. సవరించిన వేళల ప్రకారం నేడు (12-09-2026) ఈ రైలు సాయంత్రం 17:45 గంటలకు (సాయంత్రం 5:45 గంటలకు) బయలుదేరుతుంది. అంటే నిర్ణీత సమయం కంటే దాదాపు 2 గంటల 45 నిమిషాలు ఆలస్యంగా ...