భారతదేశం, అక్టోబర్ 28 -- సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు దక్షణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. పండగలు, సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు.. ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గాను సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది.

సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు మార్గమధ్యంలో తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, హెచ్.ఎస్. నాందేడ్, పూర్ణ, పర్భణి, జాల్నా , ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో అన్ని రకాల తరగతుల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ఫస్ట్ ఏసీ , సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్,జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఇందులో ఉ...