భారతదేశం, జూన్ 16 -- సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూడండి.

అమ్మవారి ఘటోత్సవం(ఎదురుకోలు) 19-07-2026 (ఆదివారం) సాయంత్రం 4.00 గంటలకు ఉంటుంది.

ప్రధాన బోనాల ఉత్సవం 02-08-2026 (ఆదివారం) ఉదయం 4.00 గంటలకు నిర్వహిస్తారు.

రంగం కార్యక్రమం 03-08-2026 (సోమవారం) ఉదయం 8.30 గంటలకు ఉండనుంది.

అమ్మవారి గజవాహన ఊరేగింపు ఉదయం 10.30 గంటల సమయంలో నిర్వహించనున్నారు.

ఈ ఆషాఢ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆల...