భారతదేశం, అక్టోబర్ 15 -- సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పదేళ్ల పాలన తర్వాత ఇప్పుడు కేటీఆర్‌కు సింగరేణి గుర్తుకురావడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. గత పదేళ్లలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు.

నిజానికి సింగరేణిలోని 'తాడిచర్ల కోల్ బ్లాక్'ను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమేనని శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ...