భారతదేశం, అక్టోబర్ 9 -- దసరా పండుగ వేళ సింగరేణి బొగ్గు గని కార్మికులకు యాజమాన్యం శుభవార్త అందించింది. అక్టోబర్ 20న రానున్న దసరా (విజయదశమి) వేడుకలను పురస్కరించుకుని కార్మికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "దసరా పండుగ అడ్వాన్స్" చెల్లింపునకు సంబంధించి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ గనులు, వివిధ విభాగాల ప్రతినిధులకు ఈ మేరకు సర్క్యులర్ పంపింది.

ఈ నిర్ణయం ప్రకారం, సింగరేణిలో పనిచేస్తున్న అర్హులైన రెగ్యులర్ ఎన్‌సీడబ్ల్యూఏ (NCWA) ఉద్యోగులతో పాటు మైన్స్ యాక్ట్ కింద లీవ్‌కు అర్హత సాధించిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున పండుగ అడ్వాన్స్ అందనుంది. అదేవిధంగా.. మైన్స్ యాక్ట్ ప్రకారం ఇంకా లీవ్ అర్హత సాధించని ఇతర తాత్కాలిక కార్మికులు, ట్రెయినీ ఉద్యోగులకు రూ.12,500 చొప్పున అడ్వాన్స్ చెల్లించనున్నారు.

క...