భారతదేశం, సెప్టెంబర్ 25 -- హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Sahiti Infratech) నిధుల మళ్లింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ భారీ మనీలాండరింగ్ స్కామ్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.

సెప్టెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఈ స్కామ్‌లో ప్రజాప్రతినిధికి ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బ్యాంక్ ఖాతాలకు సాహితి ఇన్‌ఫ్రా సంస్థ నుంచి దాదాపు రూ.2.1 కోట్లు మళ్లినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నిధుల బదిలీ ఏ ప్రాతిపదికన జరిగింది? వ్యాపారపరమైన చెల్ల...