భారతదేశం, అక్టోబర్ 25 -- Sai Krishna Custodial Death Case : విజయవాడలో తీవ్ర కలకలం రేపిన కృష్ణలంక పోలీసు కస్టడీ మరణం కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వేగవంతం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘోర ఉదంతంపై సీబీఐ కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం సీబీఐ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను నేరుగా సందర్శించి సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు.

సీబీఐ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర దేవ్ నాయకత్వంలోని ఎనిమిది మంది అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం పీఎస్‌కు చేరుకుంది. సాయికృష్ణను బంధించి విచారించారని ఆరోపణలు ఉన్న పోలీస్ స్టేషన్ రెండో అంతస్తును అధికారులు పూర్తిగా తనిఖీ చేశారు. ఈ దర్యాప్తును సీబీఐ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శివ సుబ్రమణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్...