భారతదేశం, సెప్టెంబర్ 8 -- వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడం, మార్జిన్లు తగ్గడంతో దక్షిణ కొరియా దిగ్గజం సామ్‌సంగ్ ఇండియా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. తొలి విడతగా టెలివిజన్లు, హోమ్ అప్లయెన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఇంటికి పంపించింది.

ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ లేఆఫ్‌లు దశలవారీగా సాగుతున్నాయి. ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లతో పాటు ప్రాంతీయ కార్యాలయాల్లో ఉన్న బ్రాంచ్, ఏరియా మేనేజర్లకు కంపెనీ పింక్ స్లిప్స్ అందజేసింది.

బాధిత ఉద్యోగులకు ఎటువంటి నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే రోజువారీగా టెర్మినేషన్ లేఖలు పంపుతున్నారు. నష్టపరిహారంగా మూడు నెలల జీతంతో పాటు, కంపెనీలో పూర్తి చేసిన ప్రతి ఏడాదికి అదనంగా ఒక నెల జీతాన్ని సామ్‌సంగ్ అందజేస్తోంది. ...