భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు.
గురువారం అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు-ప్రగతి, జల హారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా సమావేశ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.."మన జీవన విధానంలో నీరు చాలా ముఖ్యం. రాయలసీమలో ఊట కాల్వలు ఉండేవి. వాటిలో నీరు సమృద్ధిగా ఉండటంతో పంటలు పండేవి. కాలక్రమంలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.