భారతదేశం, నవంబర్ 18 -- తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు భారీ డంపును గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ దాచిపెట్టిన మూడు రహస్య డంప్‌లు లభ్యమయ్యాయి. వీటి నుంచి ఏకంగా 280 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL) షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు ఇచ్చిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. నవంబర్ 16న చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ (BD) బృందం సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. పూజారి కాంకేర్ గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టగా, భూమిలో పాతిప...