భారతదేశం, మార్చి 5 -- కొలంబో/వాషింగ్టన్: హిందూ మహాసముద్రం సాక్షిగా అగ్రరాజ్యం అమెరికా తన ప్రతాపాన్ని చూపింది. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన యుద్ధనౌక 'IRIS దేనా'ను అమెరికా సబ్‌మెరైన్ టార్పిడో దాడితో సముద్ర గర్భంలోకి పంపింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా రక్షణ విభాగం విడుదల చేయగా, అది ఇప్పుడు అంతర్జాలంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

అమెరికా విడుదల చేసిన వీడియో ప్రకారం.. టార్పిడో నేరుగా యుద్ధనౌక వెనుక భాగాన్ని (Stern) బలంగా తాకింది. ఆ పేలుడు ధాటికి భారీ యుద్ధనౌక ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడటం అత్యంత భీకరంగా కనిపిస్తోంది. ఈ తీవ్రస్థాయి పేలుడు అనంతరం నౌక వేగంగా సముద్రంలో మునిగిపోయింది. శ్రీలంక తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఈ దాడిపై అమెరికా రక్షణ మంత్రి (Secretary of War) పీట్ హెగ్‌సెత్ స్పం...