భారతదేశం, నవంబర్ 10 -- గత ప్రభుత్వం చేసిన వేల కోట్ల అప్పులను చెల్లిస్తూనే. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని తెలిపారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన 'రైతన్నతో ఆత్మీయ సభ'లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రూ. 9,053 కోట్ల విలువైన పలు సంక్షేమ, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

సభకు ముందు సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం రైతులతో కల...