భారతదేశం, మార్చి 30 -- తంగేడు శాస్త్రీయ నామం 'సెన్నా ఆరిక్యులేటా'. ఆయుర్వేదంలో దీనిని 'ఆవార్తకి' అని పిలుస్తారు. ఈ మొక్కలోని ఆకులు, బెరడు, వేర్లు అన్నీ కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. అయితే పూలలో ఉండే ప్రత్యేక రసాయనాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, సపోనిన్లు శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.

మనం ఆహారం తిన్నప్పుడు మన శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. దీనిని కణాలకు చేరవేయడానికి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా ఉత్పత్తి అయినా శరీరం సరిగ్గా వాడుకోలేకపోవడం జరుగుతుంది. తంగేడు పూలలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలను రక్షిస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి స...