భారతదేశం, ఆగస్టు 10 -- ఈ-కామర్స్ వ్యాపారాలకు లాజిస్టిక్స్, చెకౌట్, పేమెంట్స్ సేవలు అందించే షిప్‌రాకెట్ పబ్లిక్ ఇష్యూకి సిద్ధమైంది. ఆగస్టు 12న (బుధవారం) ప్రారంభమయ్యే ఈ ఐపీఓ ఆగస్టు 14 (శుక్రవారం) వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.

మొత్తం రూ. 1,617.48 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓలో రూ. 885.50 కోట్ల విలువైన కొత్త షేర్లను (Fresh Issue) జారీ చేయనుండగా, రూ. 731.98 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తున్నారు. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (154 షేర్లు - రూ. 14,938) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్టు 17న షేర్ల కేటాయింపు (Allotment) జరగనుండగా, ఆగస్టు 19న బీఎస్‌ఈ (BSE), ఎన్ఎస్‌ఈ (NSE)లలో షేర్లు లిస్ట్ కానున్నాయి.

షిప్‌రాకెట్ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి గిరాకీ కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నానికి షేర...