భారతదేశం, ఏప్రిల్ 4 -- కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో తనదైన ముద్ర వేశారు భూమికా యాదవ్. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఈ యువతి, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ 'షనేల్' (Chanel) కోసం ర్యాంప్ వాక్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ మోడల్‌గా చరిత్ర సృష్టించారు. మన దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న తెల్లటి రంగు పిచ్చికి, పాతకాలపు సౌందర్య ప్రమాణాలకు సవాల్ విసురుతూ ఆమె గ్లోబల్ వేదికలపై దూసుకుపోతున్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో న్యూయార్క్ సిటీలో జరిగిన షనేల్ షోను మన తెలుగు అమ్మాయి భవిత మండవ ప్రారంభించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సంచలనం ఇంకా కొనసాగుతుండగానే, ఇప్పుడు రాయ్‌పూర్ నుంచి మరో నల్లటి రత్నం అంతర్జాతీయ వేదికపై వెలుగులు విరజిమ్ముతోంది.

సాధారణంగా ఫ్యాషన్ ప్రపంచంలోకి రావాలంటే పెద్ద పెద్ద నగరాలు, మెట్రో లైఫ్‌స్టై...