భారతదేశం, అక్టోబర్ 3 -- తిరుపతి జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన శ్రీసిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి తర్వాత ఇక్కడ ఉన్న ఓ ప్రైవేట్ ఫార్మా పరిశ్రమలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

శ్రీసిటీలోని 'టిల్ హెల్త్ కేర్' పరిశ్రమలో శుక్రవారం రాత్రి కార్మికులు ఎప్పటిలాగే తమ నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్నారు. అయితే అర్థరాత్రి సమయంలో ఉన్నపళంగా ప్లాంట్‌లోని బాయిలర్/రియాక్టర్ విభాగంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ప్లాంట్ ఆవరణ తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకుపోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత...