భారతదేశం, అక్టోబర్ 28 -- Srisailam Panchamathalu Abhishekam : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో పవిత్ర కార్తిక మాసోత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధం చేస్తోంది. నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర రోజుల్లో శ్రీశైలానికి విచ్చేసే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎమ్. శ్రీనివాసరావు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కార్తీక మాసంలో ప్రధానాలయంలో నిర్వహించే శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. అయితే.. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో అభిషేకం జరి...