భారతదేశం, ఏప్రిల్ 24 -- దేశీయ ఆర్థిక సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4FY26) రికార్డు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ స్టాండలోన్ నికర లాభం ఏకంగా 41 శాతం వృద్ధి చెంది రూ. 3,014 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 2,139 కోట్లుగా ఉండటం గమనార్హం. శుక్రవారం (ఏప్రిల్ 24) జరిగిన బోర్డు సమావేశంలో ఈ ఫలితాలను వెల్లడించిన సంస్థ, తన వాటాదారులకు డివిడెండ్ రూపంలో తీపి కబురు అందించింది.

కంపెనీ ప్రధాన వ్యాపారమైన రుణాల ద్వారా వచ్చే నికర వడ్డీ ఆదాయం (NII) కూడా ఆకట్టుకునేలా పెరిగింది. ఈ త్రైమాసికంలో NII 21 శాతం వృద్ధి చెంది రూ. 6,751 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 5,566 కోట్లుగా ఉంది. అంటే సంస్థ తన రుణాల వ్యాపారాన్ని ఎంత పటిష్ట...