శ్రీదేవి స్థలం వివాదం: బోనీ కపూర్, జాన్వీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం
భారతదేశం, సెప్టెంబర్ 16 -- దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నైలోని విలువైన భూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 1988 సేల్ డీడ్ ద్వారా శ్రీదేవి సొంతం చేసుకున్న 2.7 ఎకరాల స్థలంపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు వర్గాలు కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. వివాద పరిష్కారం కోసం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని స్పష్టం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.
1988లో చెన్నై షోలింగనల్లూర్ పరిధిలో శ్రీదేవి 2.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2018లో శ్రీదేవి మరణించిన తర్వాత, ఈ ఆస్తిని ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.