శాఖ నచ్చలేదని మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
భారతదేశం, జూన్ 5 -- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో శాఖల కేటాయింపుల పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో చేరిన రెండు రోజులకే సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. అయితే, ఆయన కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ (Bengaluru Development Department) కేటాయిస్తానని ముందే హామీ ఇచ్చారని, కానీ ఆ మాట తప్పి ఆ శాఖను కృష్ణ బైరేగౌడకు అప్పగించడంతో రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు.
"నన్ను పదే పదే అవమానించారు, ఇకపై దీనిని భరించలేను. నేను పార్టీపై కోపంగా లేను, కేవలం తీవ్ర నిరాశకు గురయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.