భారతదేశం, నవంబర్ 15 -- పతనంతిట్ట: శబరిమల అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కేరళం ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శబరిమల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.533 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కింద చేపడుతున్న పనుల్లో ఇప్పటికే 80 శాతం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె. మురళీధరన్, ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి పి.కె. బషీర్ ఆదివారం వెల్లడించారు. దీనివల్ల యాత్రా మార్గాల అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని వారు తెలిపారు.

శబరిమల యాత్రా సీజన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సన్నిధానానికి తరలివస్తుంటారు. భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఆధునికీకరించిన చాలక్కాయం-పంబ రహదారిని ఇరువురు మంత్రులు పతనంతిట్టలో ఆదివారం ప్ర...