భారతదేశం, జూన్ 1 -- జ్యోతిష్య ప్రపంచంలో రేపటి రోజున ఒక అరుదైన, అత్యంత శక్తిమంతమైన గ్రహాల మార్పు చోటుచేసుకోబోతోంది. జూన్ 2వ తేదీ.. మంగళవారం నాడు దేవగురువైన బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలోనే శని దేవుడితో కలిసి 'నవపంచమ రాజయోగాన్ని' సృష్టించబోతున్నాడు. వేద జ్యోతిష్యశాస్త్రంలో శని, బృహస్పతి గ్రహాల ప్రభావంతో ఏర్పడే ఈ నవపంచం రాజయోగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది అత్యంత శుభప్రదమైనదిగా, మానవ జీవితాలపై తీవ్రమైన సానుకూల ప్రభావం చూపేదిగా జ్యోతిష్య నిపుణులు అభివర్ణిస్తారు.

నవగ్రహాలలో ఒకదానికొకటి ఐదవ, తొమ్మిదవ స్థానాల్లో గ్రహాలు సంచరించినప్పుడు ఈ అరుదైన యోగం సిద్ధిస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఐదవ ఇల్లు అనేది మనిషి యొక్క తెలివితేటలు, జ్ఞానం, సంతానం, సృజనాత్మకత, ఉన్నత విద్య, ఆకస్మిక ధనలాభాలకు ప్రతీకగా నిలుస్తుంది...