భారతదేశం, మే 7 -- సాధారణంగా అమావాస్య అంటే భయం, శని అంటే వణుకు. కానీ ఈ రెండూ కలిసిన 'శనిశ్చరి అమావాస్య' అనేది ఒక అరుదైన సమయం. ఈ రోజున చేసే పనులు మీ జీవితంలోని అడ్డంకులను తొలగించడమే కాకుండా, పితృదేవతల ఆశీస్సులను కూడా అందిస్తాయి. 2026లో శని జయంతి (శని అమావాస్య) మే 16, శనివారం వస్తోంది. అయితే ఈరోజుకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

చాలామందికి శని జయంతి అంటే జ్యేష్ఠ మాస అమావాస్య అని తెలుసు. కానీ పురాణాల ప్రకారం శని దేవుడు సూర్యుడు, చాయా దేవికి జన్మించినప్పుడు, ఆ రోజున ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కప్పబడి, సూర్యగ్రహణం లాంటి స్థితి ఏర్పడిందట. అందుకే చీకటి (అమావాస్య) మరియు శనికి విడదీయలేని సంబంధం ఉంది. ఈ రోజున చేసే ధ్యానం వల్ల మనలోని 'అజ్ఞానమనే చీకటి' తొలగిపోతుందని యోగులు చెబుతారు.

శని గ్రహం మన శరీరంలోని ఎముకలు, ఇనుముపై ప్రభావం చూపుతుందని...