భారతదేశం, జూలై 10 -- ప్రస్తుత గ్రహాల స్థితిగతులను గమనిస్తే అత్యధికంగా ప్రభావితమయ్యే రాశి ఏదైనా ఉందంటే అది కచ్చితంగా కుంభరాశి అనే చెప్పాలి. ఈ రాశిపై రాహువు సంచారం కొనసాగుతుండటంతో పాటు ఏల్నాటి శని ప్రభావం కూడా బలంగా ఉంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలం కుంభరాశి వారికి అనేక కీలక మార్పులను తీసుకురాబోతోంది. ముఖ్యంగా శని, రాహువులతో పాటు గురు గ్రహాల స్థాన చలనం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే ఆసక్తికర అంశాలను ఇక్కడ క్షుణ్ణంగా విశ్లేషిద్దాం.

ఆర్థిక పరంగా చూస్తే కుంభ రాశి వారికి ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేవు. ఎందుకంటే ఏల్నాటి శని మూడవ దశ (చివరి దశ) ఇంకా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ ఏల్నాటి శని పీడ పూర్తిగా తొలగిపోతుంది. ఈ లోగా ధనాన్ని పొదుపు చేయడం మీకు కొంత కష్టంగా మారే ప్ర...